విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్

ములుగు: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని,వాటిని సాధించడానికి పట్టుదలతో ముందుకు సాగాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం, మరియు మదనపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం జరిగిన యురేకా 2020, మన ఊరికే మన గురుకులం అనే కార్యక్రమానికి ప్రిన్సిపాల్ శారద అధ్యక్షత వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తస్లీమా మహమ్మద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులలో నీ ప్రతిభను,నైపుణ్యాలను వెలికి తీయడానికి యురేకా 2020,మన ఊరికే మన గురుకులం అనే కార్యక్రమం నిర్వహించడం అభిందనీయమన్నారు, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులలోని సృజనాత్మకతను బయటకి తీయవచ్చు అని అన్నారు, విద్యతోనే అనుకున్నది సాధించవచ్చని,జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇప్పటి నుండే కృషి చేయాలని ఆమె అన్నారు, అనంతరం వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ తో పాటు బహుమతులు అందజేశారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శారద, సర్పంచ్ పోరిక రామ్ కుమార్, శృజన్, లక్ష్మణ్,భద్రయ్య,నవీన్,రమేష్,ఉపాధ్యాయులు గ్లోరి,రజిత,అస్మా,జ్యోతి,ఫాతిమా,శిరీష,రమాదేవి,శ్రీవాణి, జాయిసి,స్వర్ణ,జ్యోతి,భాగ్యలక్ష్మి,రజినీ,రాజు,నవీన్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.