విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలి: జిల్లా విద్యాశాఖాధికారి

ములుగు: జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి సోమ‌వారం మండలం లోని ZPHS వెంకటాపూర్, ZPHS పాలంపేట లను సందర్శించారు. ఈ సందర్బంగా 9, 10 తరగతులకు నిర్వహిస్తున్న ప్రత్యక్ష భోదనా తరగతులను పరిశీలించారు. రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాలు, covid -19 నిబంధనలను పాటించాలని సూచించారు. పాఠశాల ఆవరణ, ఆటస్థలం, తరగతి గదులు, వంట గది, గ్రంధాలయం, మూత్రశాల, నీటి ట్యాంక్, ప్రయోగశాలతో పాటు వంటమనుషులు పరిశుభ్రముగా ఉండాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు విధిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని చెప్పారు. పాఠశాలలో ప్రతీ ఉపాధ్యాయుడు సిలబస్ పై అవగాహనా కలిగి ఉండాలని, ఇంతవరకు ఆన్లైన్ లో ఎన్ని చాప్టర్ లు పూర్తి చేసారు, ఇంకా ఎన్ని చాఫ్టర్లు ప్రత్యేక్షంగా భోదించాలో ప్రణాళిక ఉండాలని చెప్పారు. Online మరియు ప్రత్యక్ష భోదనకు సంబందించిన రికార్డు లు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రత్యక్ష భోదనా తరగతులకు విద్యార్థుల హాజరు శాతం పెరగాలని, దీనికి తల్లి తండ్రులకు అవగాహనా సమావేశం ఏర్పాటు చేసి పిల్లలు పనిలో కాకుండా బడిలో ఉండేటట్టు ప్రయత్నం చేయాలనీ కోరారు. విద్యార్థులకు ప్రతిరోజూ పాఠశాలకు రావాలని సమయం తక్కువ ఉన్న కారణంగా ప్రణాళికాయుతంగా చదివినట్టయితే పాస్ కావడం సులభమని చెప్పారు. ఈ సరి పదవ తరగతి విద్యార్థులకు 11 పేపర్లు కాకుండా 6 పేపర్లు మాత్రమే ఉంటాయాని, పరీక్ష సమయం పెంచడం జరిగిందని, ఛాయస్ ప్రశ్నల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమం లో జిల్లా సెక్టోరల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, బాబురావు తదిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.