విశాఖలో 2,840కేజీల గంజాయి స్వాధీనం

విశాఖ: విశాఖ జిల్లాలో వేర్వేరు చోట్ల భారీ ఎత్తున గంజాయిని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అలాగే ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పాడేరు వద్ద ఐచర్వ్యాన్లో తరలిస్తున్న 2వేల కేజీలు పట్టుకున్నారు. అలాగే హుకుంపేట వద్ద మరో వ్యాన్లో తరలిస్తున్న 840కేజీలు పట్టుకున్నారు. రెండుచోట్ల 2వేల 840 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.