విశాఖ స్టీల్ ప్లాంటులో అగ్నిప్రమాదం
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంటులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 ద్రవ రూప ఉక్కును ఉంచిన లాడిల్ జారిపడటంతో ప్రమాదం సంభవించింది. లాడిల్ జారిపడిన ప్రదేశంలో ఆయిల్ ఉండటంతో ఒక్క ఉదుటున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్నఇద్దరికి గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది.