వేములవాడకు పోటెత్తిన భక్తజనం

వేముల‌వాడ‌: కార్తీక పౌర్ణమి ప‌ర్వ‌దినం సందర్భంగా హరిహర క్షేత్రమైన వేములవాడ పార్వతీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయానికి ఇవాళ (సోమ‌వారం) భక్తులు పోటెత్తారు. ఉదయం స్వామివారికి 11 మంది అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకుని తన్మయత్వం చెందారు. రాత్రి 7.30 గంటలకు ఆలయం ముందుభాగంలో అర్చకుల వేదమంత్రాల మధ్య జ్వాలాతోరన కార్యక్రమం నేత్ర పర్వంగా నిర్వహించబడుతుంది. రాత్రి 10 గంటలకు స్వామివారికి మహాపూజ ఘనంగా నిర్వహిస్తారు.

(వేములవాడకు పోటెత్తిన భక్తజనం)

Leave A Reply

Your email address will not be published.