వైజాగ్ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
విశాఖపట్టణం: ఎపిలోని వైజాగ్‌లో ఉన్న ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలోని జేపీఆర్ ల్యాబ్స్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో భారీఎత్తున మంటలు చెలరేగి దట్టంగా పొగలు అళముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో మూడు సాల్వెంట్స్ డ్రమ్ములు దగ్ధమయ్యాయి. మొత్తం మూడుసార్లు పేలుళ్లు సంభవించాయని, పేలుడుకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.