తెలంగాణ‌లో వ్యవసాయానికి పెద్ద‌పీట‌: మంత్రి హరీశ్‌

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంత‌రం సిఎం కెసిఆర్ వ్య‌వ‌సాయరంగానికి పెద్ద‌పీట వేశార‌ని ఆర్ధిక మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంపై ఏటా రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నదని మంత్రి అన్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం నందిగామలో రైతువేదిక, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కరించామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారని చెప్పారు. అనంతరం పఠాన్‌చెరు టౌన్‌లో గాంధీ థీమ్ పార్కుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.1.6 కోట్లతో పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.