వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఎర్రబెల్లి
వరంగల్: ఎంజీఎం హాస్పిటల్ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి లేదని, ప్రజలు భయాందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సమయంలో ఎంజీఎం వంటి ప్రభుత్వ దవాఖానలల్లోనే మంచి వైద్యం అందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, డీఎంహెచ్‌ఓ, ఎంజీఎం సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.