వచ్చే మూడు రోజులపాటు ఎపిలో వాతావరణం…

అమరావతి: ఉత్తరాంధ్రలో ఈ రోజు మరియు రేపు ఉరుములు, మెరుపులు తో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు 30-40 km h వేగంతో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో ఈ రోజు మరియు రేపు, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు గరిష్ట ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
ఇక రాజయలసీమలో ఈ రోజు, రేపు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు, సగటు గరిష్ట ఉష్ణోగ్రత ల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.