వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఒపి సేవలు నిలిపివేత

వరంగల్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రులలో కరోనా పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో వరంగల్ ఎంజిఎం సూపరింటెండెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఎంజిఎంలో ఒపి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. సాధారణ వార్డులో ఎమర్జెన్సీ రోగులకు సేవలందిస్తామని ఈ సందర్భంగా లిపారు. కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోగులకు ఎంజీఎంలో పూర్తి స్థాయి చికిత్స అందించనున్నారు.