శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ
తిరుమల (CLiC2NEWS): తిరుమలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు శ్రీవేంకటేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఘనస్వాగతం పలికారు. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. శుక్రవారం మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు. అనంతరం తిరుమల నుంచి రేపు మధ్యాహ్నం సిజెఐ హైదరాబాద్కు రానున్నారు.