సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోశాల, అన్న‌దాన సత్రానికి శంకుస్థాపన

వ‌రంగ‌ల్‌: భార‌తీయ సంస్కృతిలో గోశాల‌, అన్న‌దాన స‌త్రం రెంటికీ ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. అయితే ఈ రెంటికి సంస్కృతి ఫౌండేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది. వరంగల్ నగరానికి కూత‌వేటు దూరంలో ఉన్న గీసుకొండ మండలంలోని కొమ్మల గ్రామం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ నన్నేం రాజ్యలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్య‌ల‌క్ష్మి మాట్లాడుతూ సంస్కృతి ఫౌండేషన్ ద్వారా ఈ కార్య‌క్ర‌మాల‌కు ఈ రోజు శంకుస్థాప‌న చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని తెలిపారు. ఈ ఫౌండేష‌న్‌ ద్వారా గోవుల ర‌క్ష‌ణ‌కు త‌గు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలిపారు. హిందువులకు ఆవు ఆరాద్యమైనదని.. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయని తెలిపారు. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చతుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రదక్షిణం  చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు అని తెలిపారు.

అలాగే నిత్యాన్న‌దాన స‌త్రం నిర్వ‌హ‌ణ గురించి మాట్లాడుతూ.. “అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు“ అని పేర్కొన్నారు.

ఇంకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వ‌హించే ప‌లు కార్యక్రమాలు

  • గో సంరక్షణ, గోశాల నిర్వ‌హ‌ణ‌…
  • పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు, శ్రీమంతాలు జరిపించ‌డం.
  • నిరుపేద‌ వృద్ధులను దత్తత తీసుకొని వారికి నిత్యావసరాలను స‌మ‌కూర్చ‌డం.
  • మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా కుట్టు మిషన్, టైలరింగ్, పచ్చళ్ల తయారీ, చిప్స్ తయారీ మొదలగు కుటీర పరిశ్రమలకు ఉచిత శిక్షణ.
  • గ్రామీణ పిల్ల‌ల వ్యక్తిత్వ వికాసం కోసం భగవద్గీత శిక్షణా తరగతులు.
  • ఆదివాసి మరియు గ్రామీణ మహిళలకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు.
  • ప్రతి అమావాస్యకి పితృదేవతల జ్ఞాపకార్థం వారి ఆత్మశాంతి కొరకు అన్నదానం.
  • జ్యోతిష్య పండితులచే ఉచిత జ్యోతిష సేవలు అందిస్తాము
  • కర్మకాండలు, తిథి, తద్దినం సంవత్సరీకాలు..

ఇలాంటి త‌దిత‌ర ప‌లు ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తాం అని సంస్థ చైర్మన్ నన్నేం రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కక్కేర్ల శ్రీనివాస్, సంస్థ డైరెక్టర్స్ వెంకట యోగి రఘురాం, దత్తాత్రేయ రాజేందర్, జానకిరామ్ K. శ్రీకా౦త్, నన్నెం శ్రీహర్ష, దివ్య మానస తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ చైర్మన్ నన్నేం రాజ్యలక్ష్మి, మేనేజింగ్ డైరెక్టర్ కక్కేర్ల శ్రీనివాస్, సంస్థ డైరెక్టర్స్ వెంకట యోగి రఘురాం, దత్తాత్రేయ రాజేందర్, జానకిరామ్ K. శ్రీకా౦త్, నన్నెం శ్రీహర్ష, దివ్య మానస తదితరులు
Leave A Reply

Your email address will not be published.