`సమాచార హక్కు చట్టం` కొత్త సంవ‌త్స‌రం కేలండ‌ర్‌ను ఎల్లారెడ్డి డిఎస్పి

ఎల్లారెడ్డి : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఈరోజు అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్టం 2021 నూతన క్యాలెండర్ ను ఎల్లారెడ్డి డి ఎస్ పి శశాంక్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు. అని ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ చట్టం ద్వారా గ్రామపంచాయతీ నుండి మొదలుకొని పార్లమెంటు వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం తీసుకోవచ్చని అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 పైన ప్రజలకు మరియు అధికారులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ షారారు, జిల్లా ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు మోతే లావణ్య మరియు ఖాద్రి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.