సరదాగా ఈతకు వెళ్లి.. ముగ్గురు యువకుల గల్లంతు

ఖమ్మం : సెలవు రోజని ఆదివారం పూట సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీటిలో గల్లంయిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాలలో చోటు చేసుకుంది. గల్లంతైన ముగ్గురు యువకులను కల్లూరు మండలం బత్తులపల్లి వాసులు. ప్రాజెక్టులో గల్లంతైన యువకులు జంగ గుణ (24), శీలం చలపతి (25), వేమి రెడ్డి సాయి (18)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుల ఆచూకీ కోసం గజఈతగాళ్లను రంగంలోకి దింపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.