CovidVaccine: సా.4 గంటల నుండి టీకా రిజిస్ట్రేషన్

హైదరాబాద్(CLiC2NEWS): భారత్ లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. సెకండ్‌వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ పొందాలనుకునేవారు CoWin వెబ్‌పోర్టల్‌లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా ఇవ్వడం వల్ల టీకా కేంద్రాలకు వచ్చే వాళ్లతో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున టీకా కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే… మూడో దశ టీకా పంపిణీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయాల్లో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలువుతుందని తెలిపింది.
మే 1 వ తేదీ నుంచి 18 ఏళ్ళు నిండిన వారికి వ్యాక్సిన్ అందించే కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ఆరోగ్యసేతు, కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాగా, ఈ వ్యాక్సిన్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ అందించబోతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ ఫ్రీ అని ప్రకటించాయి. ఉత్పత్తి దారుల నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అటు కేంద్రం కూడా కొనుగోలు చేసిన వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగా అందించబోతున్నారు.
కొవిన్ టీకా నమోదు ఇలా.
- ముందుగా కొవిన్ పోర్టల్ (cowin.gov.in ) ఓపెన్ చేయాలి.
- అనంతరం మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- మొబైల్‌కు వచ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ఫర్ వ్యాక్సినేషన్ అని పేజి ఓపెన్ అవుతుంది.
- దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డును ఎంచుకుని దాని నంబర్‌తో పాటు పేరు, పుట్టిన సంవత్సరం వంటి వివరాలను నమోదు చేసి, రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ అనంతరం ఏ రోజు టీకా వేయించుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి.
- ఇందుకోసం ముందుగా షెడ్యూల్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే.. అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫార్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత వ్యాక్సినేషన్ కేంద్రం ఎంచుకోవాలి. అది ప్రైవేట్ లేదా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రం ద్వారా టీకా తీసుకోవచ్చు. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్యసేతు యాప్‌లో కూడా రిజిస్టర్ చేసుకునే వీలుంది. అలాగే షెడ్యూల్ తేదీలను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది. కొవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.