సిఎం సహాయనిధికి రూ.10 లక్షల చెక్కను అందజేసిన చెరుకు సుధాకర్‌రెడ్డి
మంచిర్యాలః గత వారం రోజులన నుండి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ఇంకా భాగ్యనగరంలోని పలు ముంపు కాలనీలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. ఎందరో ముంపుం బాధితులు సాయం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణ సాయంగా రూ. 550 కోట్లు విడుదల చేశారు. బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని సిఎం కెసిఆర్ స్వయంగా పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు సంస్థలు, ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు పలువురు ముందుకు వస్తున్నారు.
తాజాగా మంచిర్యాల జిల్లా బీమారం మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన సిఎస్ ఆర్ డెవవలపర్స్ యండి చెరుకు సుధారకర్ రెడ్డి సిఎం కెసిఆర్ పిలుపు మేరకు 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పురపాలక మంత్రి కెటిఆర్‌కు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో హుజుర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, చేవేళ్ల ఎంపి డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#HyderabadFloods దృష్ట్యా సీఎం శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు సీఎస్ఆర్ డెవలపర్స్ యండి చెరుకు సుధాకర్ రెడ్డి గారి ద్వారా సీఎం సహాయనిధికి 10 లక్షల రూపాయల చెక్కును మంత్రి శ్రీ @KTRTRS గారికి అందజేయడం జరిగింది.#HyderabadRains pic.twitter.com/xBOlSw4LLz
— Saidi Reddy Shanampudi (@TRSSaidireddy) October 20, 2020
True