సిసి కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నిబంధనపై అవగాహన

సూర్యాపేట:ట్రాఫిక్ నిబంధనలు,సిసి కెమెరాల ఏర్పాటు గూర్చి లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కట్టా వెంకట్ రెడ్డి పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు.
SI కట్టా వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకి లారీ యజమానులందరూ సహకరించాలని, వీలైనంత తొందరలో లారీలు రోడ్డు ప్రక్కన నిలపకుండ పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.హుజూర్ నగర్ టౌన్ పరిధిలో ఏర్పాటు చేసే సిసి కెమెరాలకి సహకరించాలని కోరారు.అసోసియేషన్ పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటుని చూసి ఆయన సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కోతి సంపత్ రెడ్డి,లారీ యాజమానులు తదితరులు పాల్గొన్నారు.