సీనియర్ సిటిజన్స్‌కు `ఎయిర్ ఇండియా` 50 % డిస్కౌంట్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజన్లకు 50 శాతం టికెట్ త‌గ్గింపును అమలు చేస్తోంది. 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబడిన వృద్ధులకు టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. బేస్ ధరలో 50 శాతం చెల్లించడం ద్వారా టికెట్‌ బుక్ చేసుకోవచ్చు. ఈ పథకం గురించి విమానయాన శాఖ బుధవారం సమాచారం ఇచ్చింది. దీని కోసం కొన్ని షరతులు కూడా విధించారు. ప్రయాణం రోజుకు కనీసం 7 రోజుల ముందు టికెట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర విమానయాన శాఖ పేర్కొన్నది. ఈ పథకాన్ని పొందగోరే వ్యక్తులు వయసును నిర్ధారించే ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లేదా ఏ ఇతర ఐడెంటిటీ కార్డ్‌ను కలిగి ఉండాలి. పెద్దవారితో పాటు రెండేళ్లలోపు ఉన్న చిన్నారులకు సైతం టికెట్ ధరలో తగ్గింపు అమలు చేయనున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. అయితే చిన్నారులకు ఇచ్చే ఈ ఆఫర్ ఒక బిడ్డకు మాత్రమే వర్తిస్తుందన్నారు. అది కూడా రూ.1250 కూపన్, పన్నులు వర్తిస్తాయని తెలియజేశాయి. ఎయిర్ ఇండియా నిర్వాహక విమానాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.