సూర్యాపేటలో సిమెంట్ లారీని ఢీకొట్టిన పెళ్లి వ్యాను

సూర్యాపేట: సూర్యాపే జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్దిరాల మండలం ఎరపాడు కూడలిలో ఓ పెళ్లి వ్యాను సిమెంట్ లారీని ఢీకొట్టింది. దీంతో వ్యానులో ప్రయాణిస్తున్న పది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సూర్యాపేట దవాఖాణకు తరలించారు. ప్రమాద ఘటనతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. నకిరేకల్‌లో ఓ వివాహ వేడుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.