సైబరాబాద్: రోడ్డు పై దారుణ హత్య!

హైద‌రాబాద్‌: సైబరాబాద్ లో రోడ్డు పై ఓ వ్యక్తిని హత్య చేసిన దార‌ణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ డివిజన్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ హత్య జరిగింది. అసద్ ఖాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హ‌తమర్చారు. మృతుడు అసద్ ఖాన్ గతంలో ఓ హత్యా కేసులో నిందితుడు. ఆ విషయంలోనే ప్రత్యర్థులు అసద్ ఖాన్ ను హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.  కేసు న‌మోదు చేసుకొని క్లూస్ టీం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.