స్వీట్‌ షాప్‌లో దారుణ హత్య

హైదరాబాద్: హైద‌రాబాద్‌లోని శివారెడ్డి స్వీట్‌ షాప్‌లో హ‌త్య జ‌రిగింది. ఈ దారుణ ఘ‌ట‌న షాప్‌లో ప‌నిచేస్తున్న ఇద్ద‌రు సిబ్బంది మ‌ధ్య చోటుచేసుకుంది. వీరు ఓ మహిళ విషయంలో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. తీవ్ర గాయాలపైన ఓ వర్కర్‌ మృతి చెందాడు. మదురానగర్‌లోని శివారెడ్డి స్వీట్‌ షాప్‌లో శ్రీనివాస్‌, గౌస్ అనే ఇద్ద‌రు వ‌ర్కర్లు పనిచేస్తన్నారు. ఓ మహిళ కోసం వీరిద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో ఆవేశంలో గౌస్‌ శ్రీనివాస్ మొహం తలపై పిడిగుద్దులతో విప‌రీతంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం కొత్త గూడెం జిల్లా రామవరం. భద్రాద్రి జిల్లాకు చెందిన మహిళతో వివాహేతర సంబంధంపై శ్రీనివాస్‌, గౌస్‌ మద్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. గోడ‌వ‌కు కారణమైన మహిళ ముందే జరిగిన ఘర్షణ జరిగినట్టుగా సమాచారం. ఘటనపై ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించిన వివ‌రాలు ద‌ర్యాప్తు అనంత‌రం వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.