సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. బెల్లంపల్లిలో నేడు ఆటోల బంద్

బెల్లంపల్లి: పట్టణంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పట్టణ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఆటో ల బంద్ జరుగుతోంది. పెంచిన ధరలకు అనుగుణంగా ప్రజలను ఇబ్బందులపాలు చేయకుండా ఎక్కువ చార్జీలు వసూలు చేయడం. తక్కువ చార్జీలు తీసుకునే వారి పై ఆటో యూనియన్ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కట్టా రామ్ కుమార్ తెలిపారు.పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో చార్జీలు పెంచడం జరిగిందని ప్రయాణికులు అందరూ సహృదయంతో అర్థం చేసుకుని తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.