సర్కార్‌కు ఉత్తమ్ సవాల్
సర్కార్‌కు ఉత్తమ్ సవాల్

హైదరాబాద్ః టీఆర్ఎస్ సర్కార్‌కు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో
అర్హులైన ఒక శాతం మంది పేదలకు ఇళ్లు మంజూరు చేస్తే బల్దియా ఎన్నికలలో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటుందని ఉత్తమ్ సవాల్ విసిరారు. హైదరాబాద్, ఖమ్మం,వరంగల్ మున్సిపల్ న్నికలకు సిద్దం అవుతున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే సర్కార్‌కు సవాల్ చేశారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో టిఆర్ ఎస్ సర్కార్ పూర్తిగా విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. పేదలు ఇళ్లకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే సచివాలయంలో ఆలయం, మసీదు కూల్చివేతపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీల్లో ఆగస్టు 24వరకు పార్టీ కమిటీలు పూర్తి చేయాలని ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయన కోరారు. అనుబంధ విభాగాల కమిటీలు కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. టిఆర్ ఎస్ పార్టీ హైదరాబాద్‌ను ఏ రంగంలోనూ అభివృద్ధి చేయలేదని ఇప్పుడున్న మెట్రో ప్రాజెక్టును అనాటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీసుకువచ్చారని గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన ఆరేళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఉస్మానియా ఆస్పత్రి కి ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించలేదని దుయ్యబాట్టారు. ఈ సర్కార్‌కు ప్రజల సంక్షేమంపై పట్టింపు లేదని ఆరోపించారు.