హుజూర్ నగర్ లో ఘనంగా వైఎస్‌జగన్ జన్మదిన వేడుకలు

సూర్యాపేట: జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఎస్ఆర్ లాజిస్టిక్స్ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభిమాని ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 48వ, జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుస్థిర పాలన అందిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి హుజూర్ నగర్ ప్రజల పక్షాన, వైఎస్ఆర్ అభిమానులు పక్షాన హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదెర్ల ప్రశాంత్ రెడ్డి, శెగ్యం శ్రీనివాస్, శాసనాల అంజి, దొంతగాని రాజా రమేష్, మహమ్మద్ యాసీన్, సల్వాది రాంబాబు, అఖిల్, లక్ష్మణ్, సత్యం, శివారెడ్డి, నరసింహారెడ్డి , సురేష్, వైయస్సార్ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.