హైదరాబాద్లో రౌడీషీటర్ హత్య

హైదరాబాద్ : నగరంలోని సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోరబండలో రౌడీషీటర్ ఫిరోజ్ (45) దారుణ హత్యకు గురయ్యాడు. బోరబండలోని తన ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పాత కక్షల నేపత్యంలోనే హత్యచేసి ఉండొచ్చనిపోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.