హోమియో వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8 మంది మృతి

బిలాస్‌పూర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. హోమియో వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు స్థానిక ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మంది స్థానిక డాక్టర్ వద్ద వైద్యం కోసం వెళ్లారు. ఆ డాక్టర్ హోమియోపతి మెడిసిన్ డ్రెసెరా 30లో నాటుసారా కలిపి ఆ కుటుంబ సభ్యులకు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. దీంతో 8 మంది ఒకేసారి చనిపోగా, మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యం చేసిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌డ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా డ్రెసెరా ఔషధాన్ని అనేక అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. గొంతునొప్పి, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, కీల్ల నొప్పుల నివారణకు దీన్ని వాడతారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.