‍షేక్.బహర్ అలీ: సర్వాంగాసనం ప్రయోజనాలు..

శ‌రీరంలోని అన్ని అంగాల‌కు ఉప‌యోగ‌ప‌డే ఆస‌నం కాబ‌ట్టి దీనికి స‌ర్వాంగ‌స‌నం గా నామ‌క‌ర‌ణం చేశారు.
మిగిలిన అసనాలలో ఒకటి లేదా రెండు అవయవాలు మాత్రమే ప్రభావిత మౌతాయి.
ఈ సర్వాంగాసనంలో పేరుకు తగినట్లు అన్ని అంగాలు ప్రభావితమౌతాయి.
మ‌నం ఇంత‌కు ముందు భాగంలో స‌ర్వాంగాస‌నం ఎలా వేయాలో తెలుసుకున్నాము..

(షేక్.బహర్ అలీ: అన్ని అంగాల‌ను ఉత్తేజం చేసే స‌ర్వాంగాస‌నం..)

ఈ భాగంలో స‌ర్వాంగాస‌నం వేయ‌డం వ‌ల‌న మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకుందాం…..

స‌ర్వాంగాస‌నంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు..

1. శరీరాన్ని పూర్తిగా నిటారుగా ఉంచటం వలన సెర్వీకల్ సెగ్మెంట్ ప్రభావానికి లోనై చైతన్యవంతమై శక్తి వంతంగా అవుతుంది.

2. మస్తిష్కానికి రక్తం ఎక్కువగా ప్రసారించటం వలన రక్త వాహికల బాధల వలన కలిగే తలనొప్పులు దూరం అవుతాయి.

3. థైరాయిడ్ గ్రంధి పైన గడ్డం తగలడం (జలందర బంధం) వలన చక్కటి ప్రభావం కనపడుతుంది.దీని హర్మోనులు రక్తంతో కలసి మిగిలిన స్రావలను కూడా నియంత్రణ చేస్తాయి.దీని వలన మెటబాలిజం లన్నిటిని ఆరోగ్యం చేకూరుతుంది.

3. మూలబందం,ఉడ్డీయాన బంధం,వేయటం వలన వస్తి ప్రదేశంలోని కామగ్రంధులపై ప్రభావం (gonads) పడటంతో పాటు మానసిక శక్తి, శారీరక శక్తి, యవ్వన శక్తులపైన కూడా ప్రభావం పడుతుంది.

4. పెంక్రీయాజ్,ఎడ్రినల్ గ్రంధుల మీద కూడా ప్రభావితమౌతాయి.

5. శరీరంలో అదోగామి శక్తి, ఊర్ధ్వ గామి అవుతుంది.

6. ఈ ఆసనం పూర్తి స్థితిలో ఉన్నపుడు ఉఛ్వాస నిశ్వాస క్రియలు ఆగి,దీని బలం వలన ఊపిరితిత్తుల కింద ఉన్న రంద్రాలు నిర్జీవంగా ఉండిపోవు.ఊపిరితిత్తులలోను,పొట్టలో బాగలన్నింటిని చైతన్య శక్తి సంచరించి ఉబ్బసం,ఆయాసం,వంటి రోగాలు రావు.

7. తగినంత రక్తప్రసరణలోని రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ,ఈ ఆసనం తోడ్పడుతుంది.

8. టాన్సిల్స్ లాంటి కంఠం రోగాలు తగ్గి, గొంతు మధురంగా ఉంటుంది.

9. శరీర అంగాలన్నింటికి రక్తం తగినంత అందటం, వలన కణాలన్ని ప్రభావానికి లోనై చర్మానికి అందాన్ని సమకూర్పిస్తుంది.అఖిరికి జుట్టు కుదుళ్లలో కూడా రక్తం ప్రసారించి జుట్టు రాలిపోవడం నెరియటం తగ్గుతుంది.

10. వందత్వం, మూలవ్యాధి,గర్భభ సంచిలోని. బాధలు, చెవుడు,శరీరం ఎదుగుదల లేకపోవడం,భ్రహ్మచర్యము నిలవకపోవటం,స్వప్నదోషాలు,మానసిక అశాంతి, మధుమేహం,స్మరణశక్తి,మేధాక్తులు తగ్గిపోవడం వంటి దోషాలన్ని నయమవుతాయి.

11. డయాప్రం,మస్తిష్కం వైపు లేపటం వలన జీర్ణక్రియ బలపడుతుంది.మలబద్దకం దూరం అవుతుంది.

12. అలసటను పోగొట్టి,ఈ సర్వాంగాసనం చురుకుదనాన్ని పెంచుతుంది.

13. సర్వాంగాసనంలో కొద్దిసేపు ఉండటం వలన రక్తమంత మస్తిష్కం వైపు ప్రసరిస్తుంది.యధాస్థితికి వచ్చినపుడు రక్తం కాళ్ళ వైపు తిరిగి ప్రవహించటంతో శరీరాంగాలన్నింటిని నవ చైతన్యం కలుగుతుంది.

14. దీనిని చాలా మెల్లగా చేయాలి.ప్రతి పూసకు రక్తం అంది దృడం ఐ ఎటు కావాలంటే అటు తిరుగుతుంది.ఆపైన భూమి మీదకు మెల్లగా తేవడం వలన జీర్ణక్రియ బాగుపడుతుంది.

హెచ్చరిక: గుండెపోటు ఉన్నవారు,నడుము నొప్పి,మెడ నొప్పి,ఉన్నవారు,మరియు కడుపుకి సంబందించిన ఆపరేషన్ జరిగిన వారు యోగ గురువు గారి సమక్షంలో నేర్చుకోగలరు. స్వతహాగా వేస్తే నాకు సంబంధం లేదు…

-‍షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.