అంతర్వేది రథం కేసు సీబీఐకి అప్పగింత

అమరావతి : అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. సెక్షన్ 6, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది. కాగా, సెప్టెంబర్ 5వ తేదీ శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అగ్నికి ఆహుతైంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం తీసుకుంది.