అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పాడెపై నుంచి లేచి కూర్చున్న వ్యక్తి

మదనపల్లె: చనిపోయాడనుకుని ఓ వ్యక్తిని పాడె మీద పడుకోబెట్టి అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పుటుక్కున లేచి కూర్చొన్న వ్యక్తి అందరినీ శంబ్రమాశ్చర్యాలతో ముంచేశాడు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కట్టుబావి సమీపంలో సోమవారం ఈ సంఘటన జరిగింది.
వీఆర్వో కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి మండలంలోని కట్టుబావి గ్రామంలో చెట్టు కింద రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ విషయం గుర్తించిన గ్రామస్తులు గ్రామ కార్యదర్శి మనోహర్, వీఆర్వో నాగరాజుకు సమాచారం అందజేశారు. వారు అక్కడికి చేరుకుని అతడిని పరిశీలించి చనిపోయాడని భావించారు. గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేసుకుని ఆ వ్యక్తికి అంత్యక్రియలకు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని పాడె మీద పడుకోబెట్టి, పూడ్చడానికి గోతి వద్దకు తీసుకెల్తుండగా, వున్నట్టుండి ఆ వ్యక్తి పాడె మీద నుండి లేచి కూర్చొన్నాడు. దీంతో అధికారులు అతడిని 108లో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. అయితే అతని వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయాడనుకున్నన వ్యక్తి లేచి కూర్చోవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.
[…] […]