అధికారుల గృహ నిర్భందం

పాలకుర్తి : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి సర్వేకు వెళ్ళిన అధికారులను గృహ నిర్భంధం చేసిన ఘటన మహాబూబబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో జరిగింది. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో ఇంటింటి సర్వే నమోదుకు వెళ్ళిన గ్రామపంచాయతీ కార్యదర్శి,కారోబార్ లను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెవిటి సుధాకర్,గ్రామస్తులు గృహ నిర్భంధం చేశారు.తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన ఎల్ఆర్ఎస్ తోపాటు గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేస్తు అధికారులను గృహంలో నిర్భంధించి గ్రామస్తులు నిరసన వ్వక్తం చేశారు.

అధికారులను నిర్భంధించిన వారిని శిక్షించాలి
కాగా ప్రభుత్వ అధికారులను గృహ నిర్భంధం చేసిన కాంగ్రెస్ నాయకుల‌ను కఠినంగా శిక్షించాలని మహాబుబాబాద్ జిల్లా ఫ్లోర్ లీడర్,తొర్రూర్ జడ్పీటీసీ మంగలపల్లి  శ్రీనివాస్ డిమాండ్ చేశారు.శనివారం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నఅధికారుల ను నిర్భంధించిన ఘటనకు నిరసనగా టీఆర్ ఎస్ నాయకులు తొర్రూర్ పోలిస్ స్టేషన్ ముందు ధర్నాచేపట్టారు.

 

జడ్సీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ గృహ యాజమాన్య పాస్ పుస్తకాల పంపిణీ కొరకు సమాచారం సేకరిస్తున్న గ్రామ కార్యదర్శి,కారోబార్ ను నిర్భంధించిన కాంగ్రెస్ నాయకులందరిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ధర్నాలో టీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్,ఎంపీటీసీ వల్లపు గోపమ్మ మల్లయ్య, ఉపసర్పంచ్  చెంచెర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.