అనుమానంతో ప్రేమికురాలిపై కత్తితో దాడి!

విశాఖ: నగరంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మెడపై కత్తితో శ్రీకాంత్ అనే యువకుడు దాడి చేశాడు. యువతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ గ్రామ సచివాలయంలో పనిచేస్తోంది. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో శ్రీకాంత్ అనే యువకుడు ప్రియాంక మెడపై కత్తితో దాడి చేశాడు. ఆమెపై దాడి చేసిన అనంతరం తాను మెడపై కోసుకున్నాడు. స్థానికులు వాళ్లను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియాంక పరిస్థితి విషమంగా ఉందని, దాడికి పాల్పడిన శ్రీకాంత్ పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.