అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తాం..

ఎమ్మెల్యే వేగుళ్ళ పై ధ్వజమెత్తిన వైసీపీ నేత తోట త్రిమూర్తులు

మండపేట: గ్రామాల అభివృద్దే ప్రధానద్యేయంగా పనిచేస్తాము కానీ కమీషన్ల  కోసం పని చేయమని వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ తోట త్రిమ్మూరులు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును వుద్దేశించి ఘాటుగా విమర్శించారు. మండపేట కపిలేశ్వరపురం రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం పట్టణ అధ్యక్షులు ముమ్మిడివరపు బాపిరాజు ఆధ్వర్యంలో జరిగింది . ఈ సమావేశంలో త్రిముర్తులు మాట్లాడుతూ తొడ గొడితే పడగొడతా గ్రామాల అభివృద్దే ప్రధాన ద్యేయంగా పనిచేస్తాము కానీ కమీషన్ల కోసం పనిచేయమని ఆయన అన్నారు . ఎలక్షన్ ముందు కాపులు గుర్తుకు వచ్చారు కానీ ముద్రగడ్డ పద్మనాభం బిసి రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన కుటుంబం మీద , ఉద్యమకారుల మీద కేసులు పెట్టిన సంఘటన మీరు మరచిన  ఆకేసులను తీయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కె దక్కుతుందని అభివృద్ధిలో ఎవరు ఎంత చేసింది ప్రజలకు తెలుసు అని ఆయన తెలిపారు . ద్వారంపూడి గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేసి ఎలక్షన్ కు ఓటు ఆడిగేందుకు గ్రామ ప్రజల వద్దకు వెళతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య, రెడ్డి రాజబాబు, పొతoశెట్టి ప్రసాద్, జున్నూరి సాయిబాబా , పిల్లా వీరబాబు , మహ్మద్ ఆలీషా  , ఎస్ కె అలీఖాన్ బాబా , సత్తి సత్తిబాబు , ముక్కా దాలియ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.