అమిత్‌షాతో ఎపి సిఎం జ‌గ‌న్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఎపి సిఎం జ‌గ‌న్ భేటీ అయ్యారు. సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సిఎం.. ఆ త‌ర్వాత అమిత్ షా నివాసానికి వెళ్లి స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్రం నివ‌ర్ తుఫాను నేప‌థ్యంలో జ‌రిగిన న‌ష్టంపై కేంద్ర‌సాయాన్ని కోర‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతోపాటు పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాలు స‌హా ప‌లు ఇత‌ర అంశాల‌పై చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్ ఉన్నారు.‌ మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన సాయంత్రం 5 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.