అమెరికాలో ఓ వ్య‌క్తి జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి

వాషింగ్టన్‌ : అమెరికాలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడిన ఘటన ఇల్లినాయిస్‌లో ఓ గేమ్‌ సెంటర్‌ వద్ద చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో డాన్‌ కార్టర్‌ లేన్స్‌ వద్దకు రావద్దని ట్విట్టర్‌ ద్వారా రాక్‌ఫోర్డ్‌ సిటీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీస్‌ చీఫ్‌ డాన్‌ ఓషియా తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు చేర్చినట్లు చెప్పారు. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కాల్పులకు వెనక గల కారణాలు వెల్లడించలేదు.

Leave A Reply

Your email address will not be published.