అమెరికాలో కాల్పుల కలకలం.. వేర్వేరు ఘటనల్లో 11 మంది మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. కొలరాడో మొబైల్ హోమ్ పార్క్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులు జరుపడంతో ఏడుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులకు గల కారణాలేమిటో తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో పిల్లలు ఉన్నట్లు సమాచారం.
ఉడ్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి ఇరుగుపొరుగు వారిపై కాల్పులు జరిపాడు. ఈఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఘటన తర్వాత నిందితుడు ఆ ఇంటికి నిప్పంటించినట్లు తెలిపారు. నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు చేయగా.. దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.