అమెరికాలో చిత్తూరుకు చెందిన యువతి ఆత్మహత్య
చిత్తూరు: చిత్తూరు పట్టణానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అమెరికాలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చిత్తూరు పోలీసు కాలనీలో ఆమె తల్లిదండ్రులు నివాసముంటున్నారు. అమెరికాలోనే ఉంటున్న యువతి సోదరుడు తల్లిదండ్రులకు సమాచారమందించాడు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.