అమ‌ర జ‌వాన్‌ల‌కు ఆర్మీ ఘ‌న‌ నివాళులు

శ్రీన‌గ‌ర్‌: వీర మ‌ర‌ణం పొందిన అమర జ‌వాన్‌ల‌కు ఆర్మీ ఘ‌నంగా నివాళులు అర్పించింది. ఉన్న‌తాధికారులు, సైనికులు వారి పార్థివ‌దేహాల‌పై పుష్ప‌గుచ్ఛాలుంచి అంజ‌లి ఘ‌టించారు. గ‌త శుక్ర‌వారం పాకిస్థాన్ సైన్యం బ‌రితెగించి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గురెజ్, కెరాన్‌, యూరీ సెక్టార్‌ల‌లో భార‌త సైనిక స్థావ‌రాలే ల‌క్ష్యంగా జ‌రిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోవ‌ల్‌తోపాటు హ‌వ‌ల్దార్ హ‌ర్ద‌న్ చంద్ర రాయ్‌, నాయ‌క్ స‌తాయ్ భూష‌ణ్ రామేశ్‌రావు, గ‌న్న‌ర్ సుబోధ్ ఘోష్‌, సిపాయ్ జొందాలే రుషికేశ్ రాంచంద్ర వీర మ‌ర‌ణం పొందారు. వీరితోపాటు మ‌రో ఆరుగురు సాధార‌ణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

 

Leave A Reply

Your email address will not be published.