అరుదైన జాతి సొరచేప.. మత్స్యకారుల తీరు ప్రశంసనీయం
తీరువనంతపురం: కేరళకు చెందిన మత్స్యకారులు గొప్ప మనసును చాటుకున్నారు. మత్స్యకారుల తమ వలకు చిక్కిన సొరచేపను తిరిగి సముద్రంలో విడిచిపెట్టి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. అంతరించిపోతున్న అరుదైన సొరచేప పట్ల బాధ్యయుతంగా వ్యవహరించిన వారందరూ అటవీ శాఖ నుంచి అరుదైన ఆవార్డును అందుకోనున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని షాంఘుముఖం బీచ్ సమీపంలో శుక్రవారం వేటకు వెళ్లిన మత్సకారులకు అంతరించిపోతున్న అరుదైన జాతి సొరచేప చిక్కింది. అయితే ఆ సోరచాప సజీవంగా ఉండటంతో మత్స్యకారులు దాన్ని తిరిగి సముద్రంలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే దానిని సముద్రంలో విడిచిపెట్టారు. అయితే ఇదంతా తన ఫోన్లో రికార్డు చేసిన అజీత్ అనే స్థానిక వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో అంతరించిపోతున్న తిమింగలం జాతిని కాపాడేందుకు బాధ్యయుతంగా వ్యవహరించిన మత్స్యకారులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.