అల‌రిస్తున్న `ఒకే క‌ణం.. ఒకే క‌ణం..` క‌రోనా పాట

హైద‌రాబాద్ (CLiC2NEWS): దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలో ప‌లు స్వ‌చ్ఛంధ సంస్థ‌లు, ప‌లువురు ప్ర‌ముఖులు  క‌రోనాపై ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రముఖ సీరియల్ మరియు సినీ రచయిత్రి ఉషారాణి, అడ్డిచర్ల సాగర్ క‌రోనాపై ప్ర‌జ‌లు చైత‌న్యం చేయ‌డం కోసం ఓ తెలుగు పాట‌ను రూపొందించారు. 

`ఒకే క‌ణం.. ఒకే క‌ణం..` అంటూ ప్ర‌జ‌లను క‌రోనాపై అవాగ‌హ‌న క‌ల్పించే ఈ పాట‌ను ప్రముఖ సీరియల్ మరియు సినీ రచయిత్రి ఉషారాణి రాశారు. దీనికి అడ్డిచర్ల సాగర్ దర్శకత్వం వహించారు. ఈ పాట‌ను ఇవాళ (ఆదివారం) ఉద‌యం CLiC2NEWS అధ్వర్యంలో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్, నిమ్స్ హైదరాబాద్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ మార్త రమేష్ జ‌నంలోకి విడుదల చేశారు. ఈ పాట‌ను  CLiC2NEWS అధ్వర్యంలో నిర్వ‌హించిన‌ Google Meetలో విడుద‌ల చేశారు.

విఠల్, మార్త రమేష్

ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా విఠల్, డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి భారత దేశం లో ప్రళయం సృష్టిస్తుంది కావున ఈ ప్రమాదం నుండి అందరం జాగ్రత్తగా ఉంటూ, దేశ ప్రజలను కాపాడుకోవలసిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీరియల్, సినీ రచయిత్రి ఉషారాణి రాసిన పాటను కలియుగ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు అడ్డిచర్ల సాగర్ దర్శకత్వం వహించి ఇంత చ‌క్క‌ని పాట‌ను తయారు చేయడం మంచి ప్రయత్నం అని అభివర్ణించారు. ఈ ప్రయత్నం ను అందరూ ప్రోత్సాహిస్తారని వారు అన్నారు.

పాట రచయిత్రి ఉషారాణి మాట్లాడుతూ.. ఇటువంటి సేవా దృక్పథం తో చేసే ప్రతి కార్యక్రమానికి నేను నా వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కరోనా మహమ్మారి నుండి మన దేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు.

దర్శకులు అడ్డిచర్ల సాగర్ మాట్లాడుతూ..  ఉషారాణి సహకారంతో ఈ పాట ను చేయడం జరిగింది.. ఈ పాట నిర్మాణం లో సహాయ సహకారాలు సూచనలు అందించిన సీనియర్ జర్నలిస్టు షరీఫ్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ జాగృతి నవీన్ ఆచారి, లయన్స్ క్లబ్ అద్యక్షులు వేముల వీరస్వామి, CLiC2NEWS యాజ‌మాన్యాన‌కి, స్వరకల్పన చేసిన శ్రీలత, గాయని రాగిణి, సంగీతం సమకూర్చిన తిరునహరి వేణు, టెక్నికల్ దుర్గం విజయ్, కోరస్ కొప్పర్తి రవీందర్, నరేష్ రాజు,  అలాగే కలియుగ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం పెద్దలు, నాయకులు,  మిత్రులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

3 Comments
  1. Sagar says

    Thank you Click2news

    1. admin says

      సాగ‌ర్ స‌ర్ గారికి న‌మ‌స్కారం..

      దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ మీరు చేసిన ఈ ప్ర‌య‌త్నానికి CLiC2NEWS అభినంద‌న‌లు. ఈ క‌రోనా నేప‌థ్యంలో ప్రముఖ సీరియల్ మరియు సినీ రచయిత్రి శ్రీ‌మ‌తి ఉషారాణి గారు, శ్రీ‌ అడ్డిచర్ల సాగర్ గారు కొవిడ్ మ‌హ‌మ్మారిపై ప్ర‌జ‌లు చైత‌న్యం చేయ‌డం కోసం మీరు రూపొందించిన ఈ `ఒకే క‌ణం.. ఒకే క‌ణం..` పాట వీక్ష‌కుల‌ను మ‌రింత‌గా అల‌రించాల‌ని కోరుకుంటున్నాం. మీరు ఇలాంటి మంచి పాట‌లు మ‌రెన్నో తీసుకురావాల‌ని ఆశిస్తున్నాం. మీకు.. మీ టీం స‌భ్యుల‌కు అభినంద‌న‌లు.

      మీ..
      CLiC2NEWS

  2. Galesh says

    Very inspiration song … Thanq to all team

Your email address will not be published.