అస్వస్థతకు గురైన శశికళ.. ఆసుపత్రికి తరలింపు

బెంగళూరు: అక్రమాస్తుల కేసులో బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం జ్వరంతో బాధపడుతున్నట్లు జైలు సిబ్బందికి తెలిపారు. దీంతో శశికళను భద్రత మధ్య సెంట్రల్ జైలు నుంచి బెంగళూరులోని బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా, అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ మంచి ప్రవర్తన వల్ల ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తున్నది.