అస్వస్థతతో దవాఖానలో చేరిన కేంద్ర మాజీ మంత్రి

చండీగఢ్‌: కేంద్ర మాజీ మంత్రి, శిరోమని అకాలీదళ్‌ నేత హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అనారోగ్యంతో దవాఖానాలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడంతో ఆమె చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐ)లో చేరారు. దీంతో డాక్టర్లు ఆమెకు కరోనా టెస్టులు చేశారు. అందులో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా ప్రొటోకాల్‌ ప్రకారం ఆమెకు పరీక్షలు నిర్వహించామని వైద్యులు ప్రకటించారు. అయితే కరోనా లేదని నిర్ధారణ కావడంతో ఆమె గత రాత్రే దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారని న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.