ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 203 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల సమయంలో కొత్తగా 203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 231 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో ఇప్పటివరకు 8,85,437 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,75,921 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 2,382 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,134 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.