ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 70 కరోనా కేసులు

అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా తాజాగా క‌రోనా వైరస్‌ బారినపడిన వారిలో 115 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,555 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. 8,80,478 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 917 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,160 గా ఉంది.

Leave A Reply

Your email address will not be published.