ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 50 కరోనా కేసులు

అమరావతి: గడిచిన 24 గంటల వ్యవధిలో ఎపిలో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఎపి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదలచేసింది. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నెల్లూరుజిల్లాలో కరోనాతో చికిత్ప పొందుతూ ఒకరు మృతి చెందారు. అలాగా 121 మంది చికిత్సకు కోలుకొని దవాఖాల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,88,605 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అలాగే 8,80,599 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 845 మంది చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకి చికిత్ప పొందులూ ఇప్పటి వరకు 7,161 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.