ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 87 క‌రోనా కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 87 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ గురువారం సాయంత్ర బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా గ‌త 24 గంటల్లో రాష్ట్రంలో 30,527 మంది న‌మూనాల‌ను ప‌రిశీలించ‌గా ఈ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో తాజాగా న‌మోదైన కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు 8,88,692కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో కొవిడ్‌తో ఒక్క మ‌ర‌ణం కూడా సంభ‌వించ‌లేదు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు కొవిడ్ బారిన‌ప‌డి చికిత్స పొందుతూ 7,161 మంది మృతి చెందారు. కాగా తాజాగా 79 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా ప్ర‌స్తుతం రాష్ట్రంలో 853 యాక్టివ్ కేసులున్నాయ‌ని రాష్ట్ర స‌ర్కార్ బులిటెన్‌లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.