ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలకు బ్రేక్!

అమరావతి: ఏపిలో ఎన్నికల కోడ్‌తో దాదాపు అన్ని పధకాలకు బ్రేకులు పడినట్టే. అమలులో ఉన్న పథకాలను కూడా నిలిపి వేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీ ఉన్నపళంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకానికి కూడా ఎన్నికల కోడ్ అడ్డం గా మారనుంది. నిజానికి సోమవారం నాడు నెల్లూరులో సీఎం జగన్ చేతుల మీదుగా అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న పథకాలను నిలిపివేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొనడంతో ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.