ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం..

భీంపూర్: ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం తాంసి కే అటవీ ప్రాంతాలో పులి సంచారిసుండటంతో పరిసర గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. సోమవారం రాత్రి గుర్తుతెలియని జంతువు దాడిలో లేగదూడ మృతిచెందగా హతమార్చింది పెద్ద పులేనని అధికారులు తేల్చారు. మహారాష్ట్ర సరిహద్దు తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి వచ్చినట్లు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ఇప్పటికే అటవీ అటవీశాఖ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. తాంసికే అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు పశువులను మోపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని, పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.