ఆదిలాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన జోగురామన్న

ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ (పిప్పల్దరి, తంతొలి,జమ్ములదరి)గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన జోగు రామన్న. ఆదిలాబాద్ జిల్లాలోని రూరల్ గ్రామాల్లో అభివృద్ధి పనుల పురోగతి, సమస్యలపై అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై ఆరా తీసారు. మిషన్ భగీరథ పనుల పురోగతి & అంగన్వాడి భవన & కమ్యూనిటీ హాళ్లు నిర్మాణాల, ఇతర అభివృద్ధి పురోగతి పై సమీక్ష నిర్వహించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని, నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి అందరికి సునాయసం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని గూడలకి తాండలకి నీటి సౌకర్యం మెరుగుపరిచామని అన్నారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎం.పి.పి గండ్రత్ రమేష్ గారు. మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లలాద్ గారు, టీ ఆర్ ఎస్ నాయకులు జగదీష్ గారు, కొడప సోనేరావు,జంగు పటేల్ ఎం.పి.టి.సి లు ఇతర అధికారులు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.