ఆర్ధిక ఇబ్బందులు తాళలేక యువకుని ఆత్మహత్య..

మండపేట: ఆర్థిక ఇబ్బందులకు తాళలేక తీవ్ర మనస్తాపంతో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది. పట్టణ ఎస్ఐ తోట సునీత కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణ పరిధిలోని గాంధీనగర్ కు చెందిన సిహెచ్ రాజ్ కుమార్ (20) కార్ మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. అయితే వ్యాపారం కలిసి రాకపోవడంతో అప్పులు ఎక్కువై ఆర్థిక సంక్షోభంలో పడ్డాడు. దీంతో శనివారం రాత్రి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి ఆదివారం ఉదయం లేచి చూసే సరికి రాజ్ కుమార్ మృతి చెంది ఉన్నాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటన పట్టణంలో పలువురిని తీవ్రంగా కలచివేసింది.