ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు గడువు పొడగించిన సర్కార్

హైదరాబాద్: ఆస్తిపన్ను బకాయిదారులకు శుభవార్త. తెలంగాణ సర్కార్ ఆస్తి పన్ను బకాయిల చెల్లింపు గడువును పొడగించింది. నవంబర్ 15వ తేదీ వరకు వన్ టైం స్కీమ్ గడువును పెంచింది. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీమాఫీకి ఇదే చివరి అవకాశమని హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు బకాయిలు చెల్లించేందుకు అవకాశం ఉందని చెప్పారు. 2019-20 వరకు ఉన్న బకాయిలు కేవలం పది శాతం వడ్డీతో మాత్రమే చెల్లించేందుకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.